మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 మే 2022 (16:44 IST)

అక్రమ కట్టడాల జేసీబీలతో కూల్చివేత.. షాహీన్‌ బాగ్‌‌‍లో ఉద్రిక్తత....

Shaheen Bagh
Shaheen Bagh
ఢిల్లీ, షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతలకు సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు. 
 
షాహీన్‌బాగ్‌ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్‌ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
స్థానికులతో పాటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకుని, రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. 
 
కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేతల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.