మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (11:52 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మెగా ఫ్యామిలీ హీరో

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో కోలుకుని ఫిజియో థెరపీ చేస్తూవ‌చ్చారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ విష‌యం తెలిసిన మెగా అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.
 
సెప్టెంబరు 10వ తేదీన సాయి ధ‌ర‌మ్ తేజ్.. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపైన ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారు. గత నెల రోజుల‌కుపైగా సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి చికిత్స అందిస్తూవ‌చ్చారు.