శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (20:41 IST)

సమంత ఎమోషనల్ పోస్ట్: మరో ఐదేళ్ల వరకూ ఆమె డేట్స్ లేవు మరి

సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఆమె తన వైవాహిక జీవితంలో తలెత్తిన విడాకులతో కాస్త డిస్టర్బ్ అయినప్పటికీ వాటి నుంచి క్రమంగా బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది. తరచూ తన స్నేహితులతో టూర్లకు వెళుతోంది. తాజాగా తన స్నేహితురాలు అనగాని మంజుల పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

 
ఈ పోస్టులో... నీలాంటి స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణం. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందంటారు, నీకన్నా నాకు నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, హ్యాపీ బర్త్ డే అంటూ సమంత కామెంట్ పెట్టి ఫోటో పోస్ట్ చేసింది.


ఆ ఫోటోలో డాక్టర్ మంజులతో పాటు సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కూడా వున్నారు. అన్నట్లు ఆమె వరసబెట్టి సినిమాలను అంగీకరిస్తోంది. మరో ఐదేళ్ల వరకూ ఆమె డేట్స్ లేవు మరి.