గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:03 IST)

యశోదగా ఆగస్టు 12న వస్తోన్న సమంత

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజా చిత్రం యశోద ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్. హరి - హరీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మూడు కోట్లతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ సెట్ వేశారు. ఎక్కువభాగం అక్కడే తీశారు. 
 
ఇక తాజాగా కొడైకెనాల్‌‌‌‌‌‌‌‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. మే నెలాఖరుకి షూటింగ్ పూర్తి కానుంది. జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్టోరీలైన్ అని, సమంత నటనతో పాటు యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌లో ఆమె పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రేక్షకులను ఫిదా చేస్తుందని చెబుతున్నారు నిర్మాత కృష్ణప్రసాద్. 
 
ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.