1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (19:58 IST)

ఇంటిలో ప‌డిన దొంగ‌ని ప‌ట్టించిన స‌మంత‌!

Samantha Prabhu
స‌మంత ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒక ప‌క్క సినిమాలు మ‌రోప‌క్క ఓటీటీ ఆఫ‌ర్లు, ఇంకోవైపు యాడ్ ఫిలింస్‌ల‌ను కుమ్మేస్తుంది. త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పెట్టింది. త‌న ఇంటిలో దొంగ ప‌డ్డాడు చూడండి అంటూ పోస్ట్ పెట్టింది. 
 
ఈ యాడ్‌లో అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి చేయ‌డం విశేషం. యాడ్ ప్ర‌కారం  అక్షయ్ కుమార్ అర్ధరాత్రి సమంత ఇంటికి దొంగతనానికి వస్తాడు. కానీ పెద్ద‌గా ఏమీ క‌నిపించ‌వు. ఓ చోట‌ కుర్ కురే ప్యాకెట్ చూసి దాన్ని విప్పబోతాడు. ఆ సౌండ్ కి సమంత కుటుంబం వచ్చేస్తుంది. 
 
పైగా ఎవ‌రో తెలిసిన వ్య‌క్తిలా అక్షయ్ చేతిలో ఉన్న కుర్ కురే ప్యాకెట్ ని లాక్కొని ఫ్యామిలీ తింటారు.  తనకి పెట్టమని అడగడంతో  అక్షయ్ కి స‌మంత ఆ ప్యాకెట్ ఇస్తుంది.  హయిగా తినేసి తిరిగి అక్ష‌య్ వెళుతుండ‌గా, బండి వస్తుంది ఆగమని చెప్తోంది.. ఓ బండి కూడా ఇస్తారా అని అక్షయ్ ఆనందపడేలోపు పోలీస్ సైరెన్ మోగుతోంది. దీంతో అక్షయ్ పని అయిపోతోంది. 
 
ఇది నేను చేసిన యాడ్ అంటూ సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన హీరో కుర్ కురే దొంగగా మారిపోయాడు. అక్షయ్ కుమార్ ఏంటి ఈ ప్రవర్తన” అంటూ స‌ర‌దా కామెంట్ పెట్టింది. ఇంకే స‌మంతా, అక్ష‌య్ వుండ‌డంతో నెట్టింట వైరల్ గా మారింది.