గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (13:27 IST)

రోజూ అదే చేస్తానంటున్న డింపుల్ హ‌యాతి - అస‌లు ఈమె ఎవ‌రో తెలుసా!

Dimple Hayati
బాలీవుడ్‌లో సారా ఆలీఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, ధ‌నుష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా అత్‌రంగీ రే. ఈ సినిమాలో  డింపుల్ హ‌యాతి నాయిక‌గా న‌టిస్తోంది. తొలిసినిమానే పెద్ద సంస్థ‌లో న‌టించ‌డం విశేషం. ఆ త‌ర్వాత తెలుగులో ర‌వితేజ‌తో ఖిలాడి సినిమా చేస్తుంది. ఈ సినిమాలో రోజూవారీ ప‌నికి ఇబ్బందిక‌ల‌గ‌లేదు. కానీ బాలీవుడ్ సినిమాకు ఓసారి అలాంటి ఇబ్బంది వ‌చ్చిందని చెబుతోంది.
 
అదేమంటే, డింపుల్‌ రోజూ జిమ్ కు వెళ్ళే అల‌వాటు వుంది. షూటింగ్ ఎక్క‌డుంటే అక్క‌డే జిమ్ వుంటే వెళ్ళి చేసి షూట్‌లో జాయిన్ అవుతుంద‌ని చెప్పొకొచ్చింది. అత్‌రంగ్ రే షూట్ ఉత్త‌రాదిలో ఓ గ్రామంలో జ‌రుగుతుంది. త‌న‌కు వ్యాయామం చేయాల‌నుంది. కానీ అక్క‌డ అటువంటి ప‌రిస్థితి లేదు. అప్పుడు ధ‌నుష్ కు విష‌యం తెలిసి డంబుల్స్‌, ఇత‌ర వెయిట్స్ పంపించాడు. దీంతో త‌న‌కు రోజువారీ వ‌ర్క‌వుట్‌కు డిస్ట‌బ్ కాలేద‌ని డింపుల్ తెలియ‌జేస్తుంది. రోజూ ఇదే చేస్తానంటూ దిన‌చ‌ర్య గురించి చెప్పింది.
 
ఇక ర‌వితేజ‌తో న‌టించిన ఖిలాడిలో లేటెస్ట్ అప్‌డేట్ రేపు రాబోతుంది. మ‌రి కొత్త‌గా ఎంట్రీ ఇచ్చి ధ‌నుష్‌తోనే న‌టిస్తున్న డింపుల్ బేక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసా. త‌ను ఎవ‌రో కాదు. డా. దాస‌రి నారాయ‌ణ‌రావుకు మ‌న‌మ‌రాలు. సీనియ‌ర్ న‌టి ప్ర‌భకూ  మ‌న‌మ‌వ‌రాలు అవుతుంది. ఒక‌వైపు ద‌ర్శ‌కుడు, మ‌రోవైపు సీనియ‌ర్ న‌టి కుటుంబానికి చెందిన అమ్మాయే ఈ డింపుల్‌. కూచిపూడి కూడా నేర్చుకున్న డింపుల్ మంచి డాన్స‌ర్ కూడా.