శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (16:11 IST)

కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి ద‌ర్శ‌క నిర్మాణంలో కొత్త చిత్రం

Amani-Bemineni etc.
కార్తీక్ రాజు, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజ‌స్వి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సందీప్ గోపి శెట్టి ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. హార‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.
 
ఈ సినిమా గురించి ద‌ర్శ‌క నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ ‘‘డైరెక్ట‌ర్‌గా ఇది నా తొలి చిత్రం. ఘంట‌శాల విశ్వ‌నాథ్‌గారు సంగీతం అందిస్తుండ‌గా, మ‌హిగారు సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. సీజీ వ‌ర్క్‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. అలాగే కొవిడ్ ప‌రిస్థితులు ఇంకా చ‌క్క‌బ‌డి థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత సినిమా విడుద‌ల గురించి తెలియ‌జేస్తాం’’ అన్నారు.
 
హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘భీమినేనిగారితో, దేవీ ప్రసాద్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది. చాలా విష‌యాల‌ను నేర్చుకుంటున్నాను. ప్ర‌శాంత్ కార్తి ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తున్నాడు. త‌ను యాక్ట‌ర్‌గా మంచి రేంజ్‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను. మిస్తీతో నేను చేస్తున్న రెండో సినిమా. చిన్న‌పాప త‌న్వి ఇందులో కీల‌క పాత్ర చేసింది. ఆమె చుట్టూనే క‌థ తిరుగుతుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. యూర‌ప్‌లో పాట‌ల‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో మిక్స్ చేయించారు. మ‌హి అద్భుత‌మైన విజువ‌ల్స్ అందిస్తున్నారని అన్నారు.
 
మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ ‘‘భీమినేనిగారు, దేవీ ప్రసాద్‌గారు, ఆమ‌నిగారు వంటి సీనియ‌ర్స్‌తో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. కార్తీక్‌తో నేను చేస్తోన్న రెండో చిత్ర‌మిది. ఓ మ‌హిళ జీవిత ప్రయాణానికి సంబంధించిన క‌థ‌. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌ని పాత్ర‌. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది’’ అన్నారు.
 
భీమినేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ,  హీరోయిన్ తండ్రి పాత్ర చేశాను. హీరో కార్తీక్ కార‌ణంగా ఈ సినిమాలో న‌టించ‌డానికి నేను అంగీక‌రించాను. సందీప్ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. త‌న ఫ్యామిలీ కూడా చ‌క్క‌టి స‌హ‌కారం అందిస్తున్నారు. త‌న‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
దేవీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఆమ‌నిగారితో క‌లిసి తొలిసారి న‌టిస్తున్నాను. డైరెక్ట‌ర్ సందీప్ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను అనుకున్న రీతిలో చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నాడు. హోంవ‌ర్క్ చేసి మంచి ఎక్స్‌పీరియెన్స్ డైరెక్ట‌ర్‌లా సినిమా చేస్తున్నాడు. కార్తీక్‌రాజుకి, మిస్తీకి, విల‌న్‌గా చేస్తున్న ప్ర‌శాంత్ కార్తికి మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంది. ప్యామిలీ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా సందీప్‌కి ద‌ర్శ‌కుడిగా మంచి పేరు, నిర్మాత‌గా లాభాల‌ను తెచ్చిపెట్టాల‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.
 
న‌టి ఆమ‌ని మాట్లాడుతూ ‘‘చిన్న పాప మీద బేస్ అయ్యి నడిచే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. సందీప్‌గారు మంచి స్టార్ కాస్టింగ్‌తో మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకుంటున్నారు. మంచి పాత్ర చేస్తున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. ఫ్యామిలీతో క‌లిసి కూర్చుని చూసే సినిమా. తొలి సినిమానే అయినా మంచి అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా తెర‌కెక్కిస్తున్నారు. త‌న‌కు మంచి పేరుని తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఘంట‌శాల విశ్వ‌నాథ్ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌కి వెళ్ల‌డానికి ముందే పాట‌ల‌ను కంపోజ్ చేసుకున్నాం. సందీప్‌కి బాగా న‌చ్చాయి. దాంతో పాట‌ల‌ లైవ్ స్ట్రీమింగ్ కోసం యూర‌ప్ వెళ్లాం. కార్తీక్‌గారు, మిస్తీ, ప్ర‌శాంత్ కార్తి, భీమినేని, దేవీ ప్ర‌సాద్, ఆమ‌నిగారు.. ఇలా మంచి కాస్టింగ్‌తో రూపొందుతోన్న చిత్ర‌మిదని అన్నారు.