మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:57 IST)

హీరోలా కాకుండా కమెడియన్‌లా చేసాను: సప్తగిరి

సప్తగిరి... కమెడియన్‌గా మంచి అవకాశాలే ఉన్నా... హీరోగా చేసేయాలనే హడావుడిలో రెండు రీమేక్ సినిమాలు చేసేసి పరాజయం చవిచూశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో హీరోగా నటించనున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'నేను హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రెండూ రీమేక్సే‌. వాటిలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అవగాహన ముందుగానే ఉండటంతో పెద్దగా భయపడలేదు. కానీ ఇది స్ట్రయిట్‌ సినిమా కావడంతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో చేసాను. మా దర్శక, రచయితలు కూడా ‘సెట్‌కి నువ్వు హీరోలా వస్తే చేయలేము... కమెడియన్‌లా వస్తే మంచి సక్సెస్‌ అవుతుంది’ అన్నారు. దాంతో ఆ సలహాను మనస్ఫూర్తిగా పాటించా' అన్నారు సప్తగిరి. 
 
అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ‘వజ్ర కవచధర గోవింద’లో చైనీస్‌ పాటను మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సప్తగిరి మాట్లాడుతూ ‘‘నేను ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లవర్స్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాల్లో ఎంత నవ్వించానో... ఇందులో కూడా అంత నవ్విస్తా. ‘లక్ష్యం గొప్పది’ అయినప్పుడు అతను వెళ్ళాల్సిన మార్గం కూడా మంచిగా ఉండాలి. లేదంటే దేవుడు శిక్షిస్తాడు’ అనేది సినిమా పాయింట్‌. ఎమోషన్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ చక్కగా కుదిరింది’’ అన్నారు. ‘‘మా సంస్థలో తొలి చిత్రమిది. మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని జీవీఎన్‌ రెడ్డి అన్నారు. ‘‘సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథ. అతడి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఉంటాయి’’ అని ఈ సందర్భంగా అరుణ్‌ పవార్‌ పేర్కొన్నారు.
 
మరి ఇదైనా సప్తగిరికి బ్రేక్ ఇస్తుందేమో వేచి చూద్దాం.