శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:01 IST)

నేను బట్టలిప్పడం వలనే ఇలా జరిగింది. ఆయన రియల్ హీరో..

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్యానెల్ (క్యాష్-కమిటీ ఎగైనిస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేయడంతో శ్రీరెడ్డి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గతేడాది సినీరంగంలో మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆందోళన సంచలనం అయింది. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన అర్థ నగ్న నిరసన జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశం అయింది.
 
తాజాగా తెలంగాణ ప్రభుత్వం 25 మంది సభ్యులతో క్యాష్ కమిటీ ఏర్పాటు చేయనుంది. టాలీవుడ్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులను ఈ కమిటీ డీల్ చేయబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నేతృత్వంలో కొనసాగే ఈ కమిటీలో స్టేట్ ఉమెన్ డెవల్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమీషనర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్‌లు, లేబర్ డిపార్ట్‌మెంట్ కమీషనర్, షి టీమ్స్ ప్రతినిధులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్‌లను సభ్యులుగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఎమోషనల్ పోస్ట్‌తో సీఎం కేసీఆర్‌కు, తనకు మద్దతుగా నిలిచిన కొందరు మహిళా సంఘాల ప్రతినిధులకు ఫేస్‌బుక్ వేదికగా థాంక్స్ చెప్పారు. హైదరాబాద్ వ్యక్తిగా నేను గర్వపడే సమయం ఇది. రియల్ హీరో కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నా కల ఈ రోజు నెరవేరుతోంది. బి** అనే కళంకంతో ఉన్న నన్ను ఈ ప్రపంచానికి హీరోయిన్‌ అయ్యేలా చేశారు. నేను బట్టలు విప్పి చేసిన నిరసనకు ఫలితంగా నేడు తెలుగు సినిమా పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ సమస్యలను పరిష్కరించే క్యాష్ కమిటీ ఏర్పడిందంటూ పేర్కొన్నారు.