శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (19:51 IST)

అభిమానులపై అంతెత్తు లేచిన శర్వానంద్ (వీడియో)

మహానుభావుడు సినిమాలో అతి శుభ్రతతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌లో తానేంటో నిరూపించుకున్నారు నటుడు శర్వానంద్. ఆ సినిమా శర్వానంద్‌కు మంచి పేరే తెచ్చి పెట్టింది. తిరుమలలో తన చెల్లెలు వివాహానికి హాజరు కావడానికి వచ్చిన శర్వానంద్ తిరుపతిలోని పిజిఆర్ థియేటర్‌లో

మహానుభావుడు సినిమాలో అతి శుభ్రతతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌లో తానేంటో నిరూపించుకున్నారు నటుడు శర్వానంద్. ఆ సినిమా శర్వానంద్‌కు మంచి పేరే తెచ్చి పెట్టింది. తిరుమలలో తన చెల్లెలు వివాహానికి హాజరు కావడానికి వచ్చిన శర్వానంద్ తిరుపతిలోని పిజిఆర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న మహానుభావుడు సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చుని తిలకించారు.
 
అంతకుముందు థియేటర్ లోపలికి ప్రవేశించే సమయంలో అభిమానులు శర్వానంద్‌తో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించడంతో వారిపై అంతెత్తు లేచారు శర్వానంద్. కొద్దిసేపు ఆగండయ్యా.. ఎందుకు తొందరపడతారంటూ విసుక్కున్నారు. దీంతో అభిమానులు దూరంగా జరిగారు. గంట పాటు థియేటర్‌లో ఉన్న శర్వానంద్ అభిమానులకు దూరంగానే ఉన్నారు.