శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

అకీరా నందన్‌ను హీరోగా చేయండి... రేణూ దేశాయ్‌కు విజయేంద్ర వర్మ విన్నపం

vijayendraprasad
మాస్ మహారాజ్ రవితేజ - డైరెక్టర్ వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఈ వేడుకకు  ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'గతంలో మణిరత్నం 'నాయకుడు' వంటి సినిమా చూస్తూ, ఇలాంటి సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని .. అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది'  అని చెప్పారు. 
 
'పుష్ప' తర్వాత ట్రైలర్‌తోనే తనను కథలోకి.. ఆ కాలంలో తీసుకెళ్లిన సినిమా ఇది. ట్రైలర్ చూడగానే దర్శకుడు వంశీకి కాల్ చేసి అభినందించాను. రేణు దేశాయ్ తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. ఆమె వాళ్ల అబ్బాయిని హీరోగా చేయాని, ఆ చిత్రంలో అతని తల్లి పాత్రను కూడా ఆమె చేయాలనేదే నా మాట' అనడంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. 
 
'ఇకపోతే, రవితేజ టాలెంట్ గురించి నాకు తెలుసు. భారతదేశమంతా ఆయన తన కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను. వచ్చేది దసరా.. దుర్గమ్మవారికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు.. ఆ తల్లి వాహనమైన 'టైగర్' ముందు కూడా ఎవరూ ఎదురుగా నిలబడలేరు. ఈ దసరా నీదే.. నీదే" అంటూ విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగాన్ని ముగించారు.