ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు.. రేణూ దేశాయ్
మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. స్టూవర్ట్ పురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో రేణూ దేశాయ్ కూడా నటించింది.
రేణూ దేశాయ్ ఈ చిత్రంలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఈ సినిమా రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
"నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు" అని పేర్కొన్నారు.