శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (11:14 IST)

'లీడర్‌'గా పవన్ కళ్యాణ్? : రానాకు షాకిచ్చిన శేఖర్ కమ్ముల

గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'లీడర్'. రానా దగ్గుబాటి హీరో. సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే రానుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన 'లీడర్' సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
 
ఈ అంశంపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ, 'లీడర్' సీక్వెల్‌ను ఓ స్టార్ హీరోతో చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'లీడర్' సీక్వెల్ సినిమాను పవర్ స్టార్‌తో చేయనున్నారన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. 
 
అంతేకాదు ఒక నాయకుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటీకే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ సినిమా మరింత మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారట. సినిమాను కూడా 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక ఇప్పటికే పవన్ భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉండే అవకాశం ఉంది.