షూటింగ్ స్పాట్‌లో రియల్ ఫైట్...
సాధారణంగా సినిమా లేదా టీవీ సీరియల్స్ షూటింగ్‌ల కోసం డూప్‌లతో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. కానీ, ఇక్కడో షూటింగ్ స్పాట్‌లో రియల్ ఫైట్ జరిగింది. బుల్లితెర నటి రాగ మాధురిపై సహ నటి జ్యోతి, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాగమాధూరి స్వల్పంగా గాయపడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ సీరియల్ షూటింగ్ స్పాట్‌లో తన బంగారపు గొలుసు పోయిందని రాగమాధూరి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొలుసును జ్యోతి అనే మహిళ చోరీ చేసివుండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
దీంతో పోలీసులు జ్యోతిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఇంతలో క్యాబ్ డ్రైవర్ తన కారులో చైన్ దొరికిందని స్టేషన్‌కు వచ్చి అందజేశాడు. ఈ చైన్‌ను తీసుకున్న రాగమాధూరి నేరుగా స్టేషన్ నుంచి షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయింది.
అయితే, తమను అనుమానించడమే కాకుండా, స్టేషన్‌కు పిలిపించి తమ పరువు తీసిందని ఆగ్రహించిన జ్యోతి తన అనుచరులతో కలిసి షూటింగ్ స్పాట్‌కు వెళ్లి రాగమాధూరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మాధూరి తిరిగి పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.