మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (12:14 IST)

పాపం.. శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను: షకీలా

శృంగార తార షకీలా.. తెలుగులో తాజాగా కొబ్బరి మట్ట ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో షకీలా సంచలన కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు షకీలా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపు ఎదురుకాలేదని వెల్లడించింది.
 
కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి ఇబ్బంది పడలేదని చెబుతూ.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను. తన చేతుల కష్టంపై పోరాడి వెనక్కి రాగలిగా అంటూ శ్రీరెడ్డికి పంచ్ వేసింది. 
 
కానీ గతంలో ఇదే కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం ఓ నిర్మాత తనను షూటింగ్ అయిపోయిన తరువాత వస్తావా..? అని అడిగాడని.. అతడి పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తాను నమ్మకద్రోహానికి గురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఎదురుతిరిగి నిలబడతానని షకీలా వెల్లడించింది.