నటి శోభన ఇంట్లో నగదు చోరీ.. ఎవరు చేశారో తెలుసా?
నటి శోభన ఇంట్లో రూ.40వేలు నగదు చోరీకి గురైంది. ఈ ఘటనపై పోలీసులకు శోభన ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శోభన ఇంట్లో పని చేసే పనిమనిషే డబ్బు దొంగిలించిందని తెలిపారు.
దీంతో పనిమనిషి కూడా తన తప్పును ఒప్పుకుంది. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అందుకే డబ్బు దొంగిలించవలసి వచ్చిందని శోభనకు తెలిపింది. క్షమించమని వేడుకుంది. దీంతో శోభన కేసును వెనక్కు తీసుకుంది.
పనిమనిషిని క్షమించి వదిలేసింది. ఆమెని తిరిగి పనిలో నియమించుకుంది. శోభన, ఆమె తల్లి చెన్నై తేనాంపేట శ్రీమాన్ శ్రీనివాస రోడ్డులోని ఇండిపెండెంట్ హౌస్‌లో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.