సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:45 IST)

బిగ్‌బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడుపై కేసు.. శ్రీకాంత్‌పై కోపంతో శిరోముండనం..

Nutan Naidu
బిగ్‌బాస్ కంటిస్టెంట్ అయిన నూతన్ నాయుడుపై శిరోముండనం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్‌కి నూతన్ నాయుడు శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్‌లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. 
 
ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్‌పై కోపంతో సెల్‌ఫోన్ పోయిందని.. దానికోసం మాట్లాడదాం ఇంటికి రమ్మని చెప్పాడట నూతన్ నాయుడు. ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌కి నూతన్ నాయుడు గుండు కొట్టించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన నాయుడు శ్రీకాంత్‌ని బెదిరించారట. అయితే శ్రీకాంత్ పెందుర్తి పోలీసులని ఆశ్రయిండంతో, ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
 
కాగా.. ఇలా ఒక దళిత యువకుడిపై శిరోముండనం నిజంగా నూతన్ నాయుడు కనుక చేస్తే అతడిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. అతడికి ఉన్న డబ్బు మధంతో ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అతడికి ఎలాంటి ఫేమ్, నేమ్ లేకపోయినా.. బిగ్ బాస్ హౌస్‌లో సుద్దపప్పులా ఎలాంటి టాస్క్ సరిగ్గా చేయకున్నా ఒక మూలాన కుర్చుంటుంటే ప్రేక్షకులు అతడిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపించారు. 
 
అయినా ఎలాగైనా హౌస్‌లోకి అడుగుపెట్టాలని అతడు డబ్బు వెదజల్లి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని వచ్చే క్రమంలో నూతన నాయుడు ఫేక్ ఓట్లు ద్వారా దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పట్లో సంచలనం కలిగించాడు. గత నెలలో రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా "పరాన్నజీవి" అనే సినిమా కూడా నిర్మించాడు. అది అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.