1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 19 మే 2025 (17:16 IST)

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Asarula Hananam song POSTER
Asarula Hananam song POSTER
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోని సాంగ్ ఈనెల 21న విడుదలకాబోతోంది. ఇందుకు హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో లాంఛ్ చేయనున్నారు. చిత్ర టీమ్ అంతా పాల్గొంటుందని సమాచారం అందింది. అయితే పవన్ వస్తారా రాడా అనేది డైలమాలో వుంది.  జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను  హిస్టారిల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్నారు.  
 
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా మూడో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘అసరుల హననం’ అనే పాటను మే 21న ఉదయం 11.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పవన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.