శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (11:22 IST)

తొలి లిప్ లాక్ ఎవరికిస్తుందో చెప్పేసిన శ్రీలీల?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల లిప్ లాక్ ఎవరికిస్తుందో చెప్పేసింది. ఇంత వరకు శ్రీలీల హద్దులు దాటి నటించలేదు. తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా.. ఏ హీరోతో కూడా అలాంటి సీన్‌లో నటించబోనని క్లారిటీ ఇచ్చేసింది. 
 
తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది. భగవంత్ కేసరి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న శ్రీలీల పలు చిత్రాలతో బిజీగా వుంది. వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించిన ఆదికేశవ రిలీజ్‌కు రెడీగా వుంది. 
 
అలాగే పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, నితిన్‌తో సినిమాలు చేస్తోంది.