శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (09:55 IST)

బాలకృష్ణగారితో పనిచేయాలంటే భయపడ్డాను.. శ్రీలీల

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'అన్‌స్టాపబుల్ 3' టాక్ షో సీజన్-3 ప్రారంభమైంది. ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రసారం చేయబడింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ టీమ్ సందడి చేసింది. ఈ వేదికపై బాలయ్యతో పాటు అనిల్ రావిపూడి, అర్జున్ రామ్ పాల్, కాజల్.. శ్రీలీల ప్రేక్షకులను అలరించారు.
 
శ్రీలీల మాట్లాడుతూ ''బాలకృష్ణగారితో వర్క్‌ చేయడానికి భయపడ్డాను. కానీ ఆ తర్వాత ఆ భయం పోగొట్టుకుని నేను సులువుగా చేయగలిగాను. బాలకృష్ణ గారు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. బాలకృష్ణ గారు ఇలాంటి సినిమా చేయడానికి ముందుకు రావడం ఆయన మంచి మనసుకు నిదర్శనం.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించాను. ‘పెళ్లి సందడి’ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. అప్పుడు చాలా మంది ఈ సమయంలో కూతురి పాత్ర చేయడం మంచిది కాదని అన్నారు. కానీ మళ్లీ అలాంటి పాత్ర చేసే అవకాశం రాదని భావించాను. స్క్రిప్ట్‌పై నమ్మకంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను" అన్నారు.