1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (22:20 IST)

నల్లి బొక్కల కూర వండాను.. తింటే రాత్రి మూలగాల్సిందే.. శ్రీరెడ్డి (video)

Sri Reddy
Sri Reddy
వివాదాస్పద నటి శ్రీరెడ్డి రూటు మార్చింది. సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈమె ప్రస్తుతం వంటకాల చేస్తూ కాలం గడుపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది.  
 
శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది.
 
తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. ఇక తాజాగా కూడా శ్రీరెడ్డి తన యూట్యూబ్ చానల్‌లో నల్లి బొక్కల కూర వండింది. 
 
తెలంగాణ ప్రజల కోసం ఇది చేసానంటూ చెప్పుకొచ్చిన శ్రీ రెడ్డి.. ఇది తింటే రాత్రి మూలగాల్సిందే అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి అందాలు ఒకవైపు, నోరూరించే కూర మరో వైపు ఉండడం చూసి నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.