గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (16:15 IST)

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చిత్రం పేరు ఓం భీమ్ బుష్

Sri Vishnu, Priyadarshi, Rahul Ramakrishna
Sri Vishnu, Priyadarshi, Rahul Ramakrishna
'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో అప్ కమింగ్ ఫిల్మ్ లో బ్యాంగ్ బ్రదర్స్‌గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఒక క్రేజీ ఫన్ రైడ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి 'ఓం భీమ్ బుష్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేశారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది.
 
ప్రీ-లుక్ గ్లింప్స్‌తో దృష్టిని ఆకర్షించిన మేకర్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ముందుకు వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు తమ చేతుల్లో పేలుడు పరికరాలతో అంతరిక్ష నౌకలో భూమిలోకి ప్రవేశిస్తున్నట్లు గ్లింప్స్ చూపించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ రూరల్ ఏరియాలో చేతిలో కొన్ని పామ్ ప్లేట్స్ తో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. వీరంతా వ్యోమగామి దుస్తులను ధరించారు. ఫస్ట్ లుక్ క్రేజీగా అందరినీ అలరిచింది.  
 
శ్రీ విష్ణు కామెడీ యూనిక్ టైమింగ్‌ లో దిట్ట, అతని గత చిత్రం సామజవరగమన విజయంతో ఉన్నత స్థాయికి దూసుకెళ్తున్న శ్రీవిష్ణు మరొక హిలేరియస్ పాత్రలో అలరించనున్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో కామిక్ రిలీఫ్‌ను అందిస్తుంది.
 
'ఓం భీమ్ బుష్' అనేది తాంత్రిక విద్యలో జపించే మంత్రం, పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా సరదా చెబుతుంటారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ ఈ సినిమా క్యాప్షన్.  హిలేరియస్ కాంబో వున్న ఈ చిత్రం క్రేజీ ఎంటర్‌టైమెంట్ అందిస్తుందని భరోసా ఇస్తోంది.  
 
తొలి చిత్రం ‘హుషారు’లో తన సత్తాను నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటి మొదటి నుండి చివరి వరకు వినోదభరితంగా సాగే చాలా క్రేజీ , హిలేరియస్ మూవీని సిద్ధం చేస్తున్నారు. ప్రతి పాత్ర చాలా కీలకమైనది, వినోదాత్మకంగా వుంటుంది.
 
ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
సాంకేతిక వర్గం విషయానికి వస్తే, రాజ్ తోట సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సన్నీ MR సంగీతం అందించారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్.
 
ఓం భీమ్ బుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మార్చి 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. వేసవిలో నవ్వుల వర్షం కోసం సిద్ధంగా ఉండండి.