శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)

సునీల్ జర్నీ.. కమెడియన్ టు హీరో టు కమెడియన్.. మళ్లీ బిజీ

కమెడియన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సునీల్, స్టార్ కమెడియన్‌గా ఎదగడానికి పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టలేదు. తనదైన టైమింగ్‌.. మేనరిజమ్‌లతో దూసుకుపోయిన సునీల్... ఆ తర్వాత హీరోగా అడుగులు వేశాడు. హీరోగా మారిన సునీల్‌ని ఆరంభంలో విజయాలు పలకరించినప్పటికీ... ఆ తర్వాత ముఖం చాటేశాయి. దాంతో ఆయన మళ్లీ కమెడియన్‌గానే కెరీర్‌ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో వెనక్కి వచ్చేశాడు.
 
ఈ మేరకు, గత ఏడాది 'అరవింద సమేత' చిత్రం ద్వారా కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా వున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'చిత్రలహరి'లో ఆయన కామెడీ ఒక రేంజ్‌లో ఉంటుందని సదరు సినిమా యూనిట్ పేర్కొంటోంది. 
 
మరో మూడు సినిమాలు సెట్స్‌‌పైనే వున్నాయి. ఇక బన్నీ హీరోగా రూపొందించే సినిమాలోనూ సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్‌ను రూపొందించాడట. త్రివిక్రమ్ ప్రత్యేకించి రూపొందించిన ఈ పాత్రతో సునీల్‌కి పూర్వ వైభవం రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.