శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (18:50 IST)

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

annamalai
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకేను గద్దె దించేవరకు తాను చెప్పులు ధరించబోనని భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.అన్నామలై శపథం చేశారు. చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు ఇపుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన గురువారం కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ, అన్నా వర్శిటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు. ఈ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. 
 
ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారన మండిపడ్డారు. ఆమె పేరును, ఫోన్ నంబరును ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని మండిపడ్డారు. తద్వారా పోలీసులు సైతం ఈ కేసులో సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించారు. 
 
ఈ ఘటనకు నిరసనగా శుక్రవార తన నివాసం వద్ద ఆరు సార్లు కొరఢాతో కొట్టుకుంటానని చెప్పారు. శుక్రవారం నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, డీఎంకేను గద్దె దించేవరకు తాను చెప్పులు కూడా ధరించనని ప్రకటించారు.