సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (16:18 IST)

పది రూపాయల కూల్‌డ్రింక్స్ తాగి ఐదేళ్ల చిన్నారి మృతి

Cool Drinks
Cool Drinks
తమిళనాడు, తిరువణ్ణామలైలో పది రూపాయల కూల్‌డ్రింక్స్ తాగి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై, కణికిలుప్పై గ్రామానికి చెందిన ఓ కూలీ రాజ్ కుమార్. 
 
ఈయన రెండో కుమార్తె కావ్యశ్రీకి ఐదేళ్లు. ఆమె ఒకటో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కావ్యశ్రీ ఆ ప్రాంతంలోని ఓ అంగట్లో పది రూపాయల కూల్ డ్రింక్స్ తీసుకుని తాగింది. ఈ కూల్ డ్రింక్స్ తాగిన కాసేపటికే ఆ చిన్నారి నోట నురగలు వచ్చాయి. 
 
ఊపిరి పీల్చుకోలేక పోయింది. వెంటనే ఆ చిన్నారిని కాంచీపురం జీహెచ్‌లో చేర్చారు. అక్కడ నుంచి ఆ చిన్నారిని చెంగల్పట్టు ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స ఫలించక కావ్యశ్రీ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు షాపుల్లో పది రూపాయలకు అమ్మే కూల్ డ్రింక్స్‌లో ఎక్స్‌పైరీ డేట్ ఇవ్వలేదని తేలింది. ఇలాంటి కూల్ డ్రింక్స్‌ను తాగకుండా వుంటేనే మంచిదని.. అలా తాగేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్, బ్రాండ్ నేమ్ వంటివి చెక్ చేసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.