బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (19:04 IST)

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

Tiruvannamalai
Tiruvannamalai
తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వెలసి వున్న తిరువణ్ణామలైలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలోని గుగై నమశ్శివాయ ఆలయంలో ప్రహరీ గోడ విరిగిపడింది. ఈ ఘటనలో భక్తులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. 

#WATCH | திருவண்ணாமலையில் பாறைகள் உருண்டு விழுந்து புதையுண்ட வீட்டிலிருந்து சடலங்கள் மீட்கப்படும் காட்சி!#SunNews | #Tiruvannamalai pic.twitter.com/ixQCIHMBKO
అంతకుముందు కొండచరియలు విరిగిపడటంతో ఒక బండరాయి నివాస భవనంపై పడి ఏడుగురు సభ్యులతో కూడిన కుటుంబం శిధిలాల్లో చిక్కుకుంది. ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తోంది.
 
35 టన్నుల బరువు కలిగిన భారీ రాయి.. సుమారు 20 అడుగుల కింద కూలడంతో ఆ రాయి కింద పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఇళ్లల్లో ఏడుగురికి పైగా వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర దేవాలయం దక్షిణ ప్రాంతంలో సుమారు 1000 అడుగుల పర్వతంలో కొండచరియలు ఏర్పడ్డాయి. వెయ్యి అడుగుల కొండపై ప్రాంతం నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు.