1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (09:44 IST)

నా ఆస్తుల కోసం నాకు పెళ్లి కాకుండా చేశారు : అలనాటి నటి కాంచన

kanchana
అలనాటి నటి కాంచన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంపాదించిన ఆస్తుల కోసం తనకు పెళ్లి కాకుండా చేశారని ఆరోపించారు. ఈ పని చేసింది కూడా ఎవరో కాదనీ కన్న తల్లిదండ్రులేనని ఆమె వాపోయారు. అయితే, దేవుని దయవల్ల 80 యేళ్ల వయస్సులో భగవంతుడి నామస్మరణంలో ప్రశాంతమైన జీవనం గడుపుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని ఆమె చెప్పుకొచ్చారు. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె తన మనస్సులోని భావాలతో పాటు పడిన కష్టాలను వివరించారు. ఎవరికోసమైతే ఇంటికి కొడుకుగా మారిపోయి కష్టపడి సంపాదించానో.. ఆ తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు. ఆదరించలేదు అని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రచారం నిజమే. నా ఆస్తుల కోసం నాకు పెళ్లి కాకుండా చేశారన్నది కూడా నిజమే. నా జీవితంలో గుండెపోటు వచ్చి పోవలసిన కష్టాలు ఎన్నో వచ్చాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను అని చెప్పారు. 
 
ప్రస్తుతం అయినవారి ఆశ్రయంలో ఉంటూ భగవంతుడి నామస్మరణలో గడుపుతున్నారు. నేను చెప్పిన మాటలను తల్లిదండ్రులు వినే పరిస్థితిలో లేనపుడు తాను నిలదీయకపోవడం తాను చేసిన పెద్ద తప్పుగా ఆమె చెప్పుకొచ్చారు. పైగా, సహనంతో సర్దుకునిపోవడం నేను చేసిన అదిపెద్ద తప్పు. మారతారేమోనని ఎదురుచూడటం పొరపాటైంది. ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు. తన పాదాల చెంతకు వస్తే అంతా తానే చూసుకుంటానని భగవంతుడు అంటాడని, ఇపుడు తాను అదే పని చేస్తూ, ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నట్టు చెప్పారు.