పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పిన థమన్.. ఏంటది?

Pawan Kalyan
జె| Last Modified సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (16:30 IST)
రెండవ ఇన్సింగ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్సకత్వం వహిస్తుంటే దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే పింక్ అని పేరు కూడా పెట్టేశారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న ఆసక్తిగా అందరిలో మెదులుతున్న తరుణంలో తమన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు.

మీకందరికీ ఓ శుభవార్త. నేను పింక్ రీమేక్ సినిమాకు సంగీతం అందిస్తున్నాం. ఇందులో పవన్ కళ్యాణ్ స్టిల్స్ కొన్ని చూశాను. అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకు మంచి బాణీలు అందిస్తానన్న నమ్మకం నాకుంది. నాపై నమ్మకం ఉంచండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మెసేజ్ చేశాడు థమన్.

దీంతో థమన్ సందేశానికి అభిమానులు తెగ రియాక్ట్ అవుతున్నారట. పింక్ సినిమాకు సరైన సంగీత దర్సకుడు మీరేనంటూ మెసేజ్‌లు పంపించేస్తున్నారట. ఈ మెసేజ్‌లు కాస్త థమన్‌కు చాలా ఆనందాన్ని ఇస్తోందట. మరోవైపు అల వైకుంఠపురం సినిమాతో హిట్ అందుకున్న థమన్ పింక్ సినిమాకు మంచి బాణీలనే అందిస్తారన్న నమ్మకం అభిమానుల్లో ఉందట.దీనిపై మరింత చదవండి :