1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (17:19 IST)

నాని, మృణాల్ ఠాకూర్ జోడిగా చిత్రం ప్రారంభం కానుంది

Nani, Mrinal Thakur
Nani, Mrinal Thakur
నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 గా రూపొందనుందని న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తునారు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు.
 
ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,  క్రియేటివ్ ప్రొడ్యూసర్ గాభాను ధీరజ్ రాయుడు పని చేస్తున్నారు.