శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (07:56 IST)

ఏది రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా.. సిగ్గులేదా.. : 'సాక్షి'పై మండిపడిన నటి ప్రగతి

pragathi
తెలుగు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఓ బడా నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనిపై నటి ప్రగతి స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు. చేతిలో పేనా ఉందని.. ఏది రాసినా చెల్లుతుందని భావిస్తున్నారా, సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్ చేసి వీడియోలోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ సాక్షి వంటి ప్రముఖ మీడియాలో వార్త వచ్చింది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన విషయం. మీరు (సాక్షి) ఒక సంస్థను నడుపుతున్నారు. అందులో ఎంతోమంది చదువుకున్నవాళ్లు ఉంటారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్‌ను ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావొచ్చు. మీరేం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను.
 
అసలు, నా వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు రాయడం బాధాకరం. ఆధారాలు ఉన్నప్పుడు రాస్తే ఫర్వాలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాయడం ద్వారా సాక్షి వంటి ప్రముఖ మీడియా సంస్థను దిగజార్చకండి. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి. జర్నలిస్టు విలువలు అనేవి ఉంటే వాటిని పాటించండి. నాపై వార్త రాయడం మాత్రం ఖచ్చితంగా అనైతికం' అంటూ ప్రగతి తీవ్ర స్వరంతో విమర్శించారు.