మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:40 IST)

నా భర్తకు కరోనా వైరస్ లక్షణాలు, స్పెయిన్ నుంచి నటి శ్రియ వెల్లడి

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇటీవలి కాలంలో కూడా నాగార్జున మనం చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్న నటి శ్రియ భర్తకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయట. ఆయన పొడిదగ్గు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో వెంటనే ఆసుపత్రికి తీసుని వెళ్లగా అతడికి చికిత్స అందించిన వైద్యులు కొంతకాలం హోం క్వారంటైన్లో వుండాలని సలహా ఇచ్చారట. ప్రస్తుతం అతడికి కరోనా నెగటివ్ ఫలితం రావడంతో శ్రియ ఊపిరి పీల్చుకున్నదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
 
కాగా శ్రియకు అవకాశాలు తగ్గడంతో 2018లో బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ అండ్రీ కొచ్చిన్‌ని రహస్యంగా వివాహం చేసుకున్నది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి స్పెయిన్‌లో బార్సిలోనాలో నివాసం వుంటోంది. ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో స్పెయిన్ కూడా వుంది.
 
కరోనా మహమ్మారి కారణంగా స్పెయిన్ దేశంలో ఇప్పటివరకూ 15 వేల మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా 1,57,022 మందికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.