సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:54 IST)

ప్రగతి ఆంటీ అదరగొట్టేసిందిగా.. తీన్‌మార్ డ్యాన్స్ స్టెప్పులు అదుర్స్

టాలీవుడ్‌లో అతి చిన్న వయస్సులోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగాబాగానే ఒదిగిపోయిన ప్రగతి.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రగతి అంటే టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అళా అమ్మ, అత్త, వదిన, అక్క పాత్రల్లో కనిపించి.. ఆ పాత్రల్లో జీవించే ప్రగతి.. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వుంటుంది.
 
అసలు విషయానికొస్తే లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ప్రగతి తన తీన్‌మార్ డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. వైట్ షర్ట్, నిక్కర్‌పై పంచ కట్టి.. అచ్చమైన మాస్ లుక్‌లో తీన్ మార్ స్టెప్పులేశారు. 
 
ఈ వీడియోను చూసిన వారంతా వావ్ ప్రగతి ఆంటీ.. మీరు చాలా బాగా చేశారు, మీలో ఇంత టాలెంట్ ఉందా.. అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.