Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటాడ‌తా మూవీ షూటింగ్ ప్రారంభం

Written By డీవీ
Updated: సోమవారం, 12 జూన్ 2023 (10:44 IST)
Arun, Srujana clapby venkat
అరుణ్‌, సృజ‌న‌ల‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ  సురేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంక‌య్య ఎమ్ నిర్మిస్తోన్న చిత్రం `వేటాడ‌తా.  ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  ప్ర‌ముఖ నిర్మాత రామ‌సత్య‌నారాయ‌ణ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సాయి వెంక‌ట్ క్లాప్ కొట్టారు. వైజాగ్ ఎక్స్ మేయ‌ర్ దాడి స‌త్య‌నారాయ‌ణ  కెమెరా స్విచాన్ చేశారు. నాగుల‌ప‌ల్లి పద్మిని స్క్రిప్ట్ అందించారు. ఈ  కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులంద‌రూ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత అంక‌య్య ఎమ్ మాట్లాడుతూ...``మా బేన‌ర్ లో `మాయా మ‌హ‌ల్‌` మొద‌టి చిత్రం. మ‌రో రెండు చిత్రాల‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మా అబ్బాయి అరుణ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నాలుగో చిత్రంగా `వేటాడ‌తా` నిర్మిస్తున్నా. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న అత్యాచారాలపై సినిమా ఉంటుంది. ఇందులో నేను టైటిల్ రోల్ చేస్తున్నా`` అన్నారు.
ద‌ర్శ‌కుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ..`` బ‌రి` సినిమా ద‌ర్శ‌కుడుగా నాకు మంచి పేరు తెచ్చింది. `వేటాడ‌తా`  నా రెండో సినిమా. ఓ రోజు అంక‌య్య గారు స్ర్కిప్ట్ ఇచ్చి చ‌ద‌వ‌మ‌న్నారు. స్క్రిప్ట్ నాకు చాలా న‌చ్చింది. అందుకే డైర‌క్ష‌న్ చేయ‌డానికి ముందుకొచ్చాను. సస్పెన్స్ అండ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో అంకయ్య గారు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వాళ్ల అబ్బాయి అరుణ్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాం. ఈ నెలాఖరులో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. అర‌కు, నంద్యాల‌, హైద‌రాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇందులో సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ కూడా న‌టిస్తున్నారు`` అన్నారు.
 
హీరోయిన్ సృజన మాట్లాడుతూ..``హీరోయిన్ గా నాకు ఇది తొలి సినిమా. ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
హీరో అరుణ్ మాట్లాడుతూ..``హీరోగా న‌టిస్తున్న నా తొలి సినిమా ఇది. మా నాన్న‌గారు మంచి క‌థ సిద్ధం చేశారు. డైర‌క్ట‌ర్ సురేష్ రెడ్డి గారు మంచి ప్లానింగ్ తో సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు`` అన్నారు.

అన్నీ చూడండి

పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం: TGRTCలో సందేశం, వీడియో

Kamareddy: వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేట్ బస్సు.. 45మందికి ఏమైందంటే? (video)

ఉదయనిధి కాదు.. అసభ్యనిధి : విపక్ష నేతపై టీవీకే నేతల ఫైర్

అలాంటి వ్యక్తి రాష్ట్రాధినేత అయితే ఆ దేవుడే కాపాడాలి : ఉదయనిధిపై ఖుష్బూ మండిపాటు

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

అన్నీ చూడండి

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments