ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (16:00 IST)

ఆంధ్రాలో వీరసింహారెడ్డి 100 డేస్ సెలబ్రేషన్స్

100days poster
100days poster
గాడ్ అఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాసీయస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి' సంక్రాంతి కానుకగా విడుదలై వీర మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన 'వీరసింహారెడ్డి' బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
 
అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన 'వీరసింహారెడ్డి' చిత్రానికి వందరోజులు పూర్తికావస్తోంది. ఎనిమిది కేంద్రాలలో విజయవంతగా వందరోజులని పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 23న వీరసింహారెడ్డి 'వీర మాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్'' ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర బృందం అంతా హాజరుకాబోతుంది. ఈ రోజుల్లో సినిమా వందరోజులు ఆడటం అరుదైన విషయం. ఈ అరుదైన రికార్డ్ ని 'వీరసింహారెడ్డి' అందుకుంది.