మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (14:32 IST)

విద్యాబాలన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ‌స‌వ‌తార‌కం లుక్‌‌

విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ‌స‌వ‌తార‌కం లుక్‌‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ''నేనేం చూస్తున్నాను'' అనే కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా‌ మారింది.

క్రిష్ దర్శకత్వంలో, బాల‌కృష్ణ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో బాల‌ ఎన్టీఆర్‌గా న‌టించేందుకు క‌ళ్యాణ్ రామ్ త‌న‌యుడు శౌర్యరామ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీకి సంబధించి కొన్ని లుక్స్ విడుదల చేసిన టీమ్ బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌లేదు. అయితే ఇప్పుడు విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ‌స‌వ‌తార‌కం లుక్‌‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ''నేనేం చూస్తున్నాను'' అనే కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా‌ మారింది.
 
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయుడు పేరుతో రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపించబోతున్నారు. హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. ఇందులో ఆకు చాటు పిందె తడిసె పాటను సైతం రీమిక్స్ చేశారు. ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు.