అర్జున్ రెడ్డితో నటుడిగా చెప్పలేని అనుభూతి పొందాను: విజయ్ దేవరకొండ
''అర్జున్ రెడ్డి'' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభ, విజయ్ దేవరకొండ నటన యువతను విశేషంగా ఆకట్టుకొంది. కేవలం రూ.5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50క
''అర్జున్ రెడ్డి'' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభ, విజయ్ దేవరకొండ నటన యువతను విశేషంగా ఆకట్టుకొంది. కేవలం రూ.5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2017లో విడుదలైన టాప్ చిత్రాల సరసన నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి విశేషాల గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర అంశాలను ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
సందీప్‌రెడ్డి దర్శకత్వంలో ఒక నటుడిగా చెప్పలేని అనుభూతి పొందానని చెప్పాడు. పాత్రపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, అవసరమైన సూచనలు, మార్గనిర్దేశం అర్జున్‌రెడ్డి పాత్రలో చూశానని చెప్పుకొచ్చాడు.
సృజనాత్మకంగా పనిచేయడం ఆయనవల్లే తనకు సాధ్యమైందని.. తాజాగా తాను నటిస్తున్న ఓ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ చిత్ర షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదన్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "మహానటి"లో కీలక పాత్ర పోషిస్తున్నా. వీటితో పాటు ఇంకా నాలుగు ప్రాజెక్టులు ఒప్పుకొన్నానని.. అవన్నీ 2018, 2019ల్లో సెట్స్‌పైకి వెళ్తాయని చెప్పాడు.