బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:12 IST)

దిల్ రాజు బర్త్‌డే సెలెబ్రేషన్స్ - బిగ్ బాస్ అండ్ కిడ్‌..

దిల్‌రాజు త‌న 50వ పుట్టిన‌రోజును గురువారం రాత్రి ప‌లువురితో జ‌రుపుకున్నారు. ముందుగా మీడియాతో జ‌రుపుకుని కేక్ క‌ట్‌చేసి.. అనంత‌రం త‌న చేయ‌బోయే భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ముందుంచారు. అనంత‌రం మిగిలిన ప్ర‌ముఖుల‌తోనూ జ‌రుపుకోవాల‌ని వెళ్ళారు. ఆ రాత్రి ఓ హోట‌ల్‌లో జ‌రిగిన బర్త్‌డే వేడుక‌లు సినీరంగానికి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 
 
అందులో హీరోలు ప్ర‌భాస్‌, రాంచ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు, విజ‌య్‌దేవ‌కొండ‌, రామ్‌, నాగ‌చైత‌న్య‌తోపాటు దిల్‌రాజు సోద‌రుడు ల‌క్ష్మ‌ణ్‌కూడా వున్న స్టిల్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. బిగ్ బాస్ అండ్ కిడ్‌.. అనే టాగ్‌తో ఆయ‌న చేసిన దీనికి ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 
 
దిల్‌రాజు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు సేవ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అయితే.. ఇంత‌వ‌ర‌కు కొన్ని గుప్త‌దానాలు చేసిన సంద‌ర్భాలున్నాయి. అవి తాను ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌న‌ని అనేవారు. 
 
త‌న పుట్టిన ఊరైన నిజామాబాద్‌లో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్తానాన్ని నెల‌కొల్పారు. అప్పుడు కూడా సినీ ప్ర‌ముఖుల‌తో ఆ దేవాల‌యాన్ని ప్రారంభించారు.  ఇదిలావుండగా, మ‌రోవైపు త‌న పంపిణీదారుడిగా, ఎగ్జిబిట‌ర్‌గా వుండ‌డంతో.. వారి అంద‌రినీ క‌లిసి త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఈ రెండు రోజుల్లో నిర్వ‌హించ‌నున్నారు.