శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (16:05 IST)

అలెప్పీలో ఖుషీగా విజయ్ దేవరకొండ

VijayDeverakonda in Alleppey.
VijayDeverakonda in Alleppey.
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తనదైన మ్యాజిక్ చేయబోతున్నారు. తాజాగా ఖుషీ షూటింగ్  కేరళ రాష్ట్రంలోని అలెప్పీ (అలప్పుజా జిల్లా యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం) లో జరుగుతుంది.
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ షూటింగ్ లొకేషన్ కోసం పడవలో ఖుషీగా వెళుతూ ఇలా ఫోస్ ఇచ్చారు. మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించారు. ఖుషీతో ఈ ఇద్దరూ జంటగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోంది.  
 
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ గా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ లో తెరకెక్కుతోన్న ఖుషీ చిత్ర రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.