మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (18:54 IST)

వినరో భాగ్యము విష్ణు కథలో సాహిత్యానికి పెద్ద పీఠ

Kiran Abbavaram song
Kiran Abbavaram song
కొన్ని పాటలు వినగానే అర్ధమవుతాయి, ఇంకొన్ని పాటలు వినగా వినగా అర్ధమవుతాయి.అలాంటి పాటలు ఎప్పుడో వస్తాయి, సాహిత్య విలువలను గుర్తుచేస్తూ మన మనసుకు ప్రశాంతత ను ఇస్తాయి. ఈ మధ్యకాలంలో  వినసొంపైన పాటలు ఎన్ని వచ్చినా, వాటిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న "వినరో భాగ్యము విష్ణు కథ" చిత్రంలోని "వాసవ సుహాస" పాటది మాత్రం ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు. 
 
పాటను అర్ధం చేసుకోవాలి అని తపనను రేకెత్తించించే పాటలు రేర్ గా వస్తాయి. అచ్చం ఈ పాట అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమాలో సిచ్యువేషన్ కి ఈ పాట ఎంత అవసరమో వాస్తవ జీవితంలో కూడా ఇలాంటి పాటలు అంతే అవసరం. క్లిష్టమైన పదాలతో సాగిన ఈ పాటకు సంగీత ప్రియులు కూడా బ్రహ్మరథం పట్టారు. వాసవ సుహాస పాటకు 1.8 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. 
 
ఒకప్పుడు ఇలాంటి పాటలన్ని "కళాతపశ్వి కే విశ్వనాధ్" గారి సినిమాల్లో వినిపించేవి. ఆయన దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంలోని ఈ లిరిక్స్ లో "వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా" అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం. 
 
ఈ మధ్యకాలంలో వచ్చే ఒక సినిమాలోని ఇటువంటి పాటను పెట్టడం అనేది సాహసం అని చెప్పొచ్చు. జనాలకు ఇటువంటివి అర్ధం కాదండి అని దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరికి చెప్పకుండా, ఈ పాటను సినిమాలో పెట్టడానికి ఒప్పుకోవడం కూడా నిర్మాత బన్నీవాసు గొప్పదనం అని చెప్పొచ్చు. వీటన్నిటిని మించి ఈ పాటను "కళాతపశ్వి కే విశ్వనాధ్" గారిచే లాంచ్ చేయించడం అభినందించదగ్గ విషయం. ఈ పాటను రిలీజ్ చేసే తరుణంలో కూడా నిర్మాత బన్నీవాసుపై ప్రశంసల జల్లు కురిపించారు విశ్వనాథ్ గారు. 
 
ఈ పాటకు విశేష స్పందన లభించడం శుభపరిణామం. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించిన ఈ పాటను కారుణ్య ఆలపించారు . చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కు సిద్దమవుతుంది.