శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (17:13 IST)

కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల

song still
song still
అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి  చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం  హీరోగా నటిస్తున్నారు. క‌శ్మీర ప‌ర్ధేశీ నాయకిగానటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ  సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ సినిమా నుండి మొదటి సింగిల్ సాంగ్ ను కళా తపస్వి కే విశ్వనాథ్ చేత రిలీజ్ చేయించింది చిత్రబృందం. "వాసవసుహాస" అనే పాటను పాటను రిలీజ్ చేస్తూ "నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎలా ఒప్పుకున్నారా ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది అంటూ ఇటవంటి పాటను ఆ చిత్రబృందం చేయడం సంతోషం అంటూ కితాబిచ్చారు. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించారు,
యుగ యుగాలుగా ప్రభోదమై,  నిన్ను మార్చినా నిన్నటి అంచునా అని రాసిన క్లిష్టమైన పాదాలకు  అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం. ఈ పాటను కారుణ్య ఆలపించారు. ఈ సినిమాకి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
 
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.