Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఒకే వేదికపై ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ ... ఫోటో వైరల్

Updated: ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:04 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జ‌న‌వ‌రి నుండి మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 
 
2020లో ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే ఈ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. గ‌తంలో వీరు ముగ్గురు క‌లిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది.
 
పైగా, ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ వార్త ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. అతి త్వ‌ర‌లో చెర్రీ న‌టించిన "వినయ విధేయ రామ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. 
 
అయితే ఈ ఈవెంట్‌కు రాజమౌళి, ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలని చిత్ర బృందం భావించిన‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దానయ్యనే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొన‌డం ప‌క్కా అని అంటున్నారు. 

అన్నీ చూడండి

Vijay’s AP Visit: చంద్రబాబు- పవన్‌లతో భేటీ కానున్న తమిళనాడు సీఎం విజయ్

Rahul Gandhi, కార్యకర్తకి మోచేతితో రాహుల్ కుమ్మాయి పోటు, వీడియో వైరల్

జంతర్ మంతర్ ఇక నిరసనలకు కేటాయించిన ప్రదేశం కాదు.. డీ-నోటిఫై

వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు... కోమటిరెడ్డి

కాన్పూర్‌లో ఆడపడుచుతో గొడవ.. కుమార్తెను విసిరేసి.. రెండో అంతస్థు నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

తర్వాతి కథనం
Show comments