సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:20 IST)

మంగ్లీ స్లిమ్‌గా కావ‌డానికి కార‌ణం అదేనా!

Singer Magli
గాయ‌ని మంగ్లీ ఇప్పుడు చూస్తే చాలా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తుంది. బక్క‌చిక్కింది అనలేంకానీ, ఇంచుమించు అలానే వుంది. కాస్త లావును త‌గ్గించుకుంది. ఇటీవ‌లే ఆమె 1997 అనే సినిమాలో ఓ పాట‌ను పాడింది. అందులో జ‌మిందారులు యువ‌తుల‌ను ఏవిధంగా బానిస‌లుగా చూస్తార‌నేది అంశంతో రూపొందింది. అదులో పాట ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాశాడు. ఆ పాట‌కు మంచి మైలేజ్ వ‌చ్చింది. కానీ పాట స‌క్సెస్‌మీట్‌కు ఆమె రాలేదు.

చివ‌రినిముసంలో ఒంట్లో బాగోలేద‌ని రాలేన‌న్న‌ట్లు తెలియ‌జేసింద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. అయితే నిన్న జ‌రిగిన మాస్ట్రో ప‌బ్లిసిటీలో ఆమె పాల్గొంది. ఆమె ఆహార్యం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. బాగా త‌గ్గిన‌ట్లుగా క‌నిపించింది. ఈమె త‌గ్గ‌డానికి కార‌ణం అనారోగ్యం ఒక‌భాగ‌మైతే, ఇదే అదునుగా స్లిమ్ అయి న‌టిగా కొన‌సాగాల‌నుకుంటుంద‌ని తెలుస్తోంది.
 
ఆమె న‌ట‌న గురించి నితిన్ కూడా కితాబిచ్చాడు. మంగ్లీ తాజాగా మాస్ట్రో సినిమాతో న‌టిగా మారింది. న‌టిస్తుందా లేదా? అనే అనుమానం ఆమెకే క‌లిగింది. కానీ ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీ ఆమెకు ధైర్యం చెప్పి న‌టింప‌జేశాడు. ఇక ఈమె న‌ట‌న చూసి నితిన్‌కు ఆశ్చ‌ర్యమేసింది.

ఆమె న‌ట‌ను చూసిన నితిన్‌, మంగ్లీ యాక్టింగ్ చూసి సింగరా? యాక్టరా? అని షాక్ అయ్యాను. ఇకపై ఆమె సింగర్‌గా పక్కకెళ్లి.. యాక్టర్‌గా బిజీగా అవుతుందని` మంచి కామెంట్ ఇచ్చాడు. దాంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ‌యింది కూడా. ఇక నితిన్ గురించి చెబుతూ, నితిన్ అసలు హీరోలాగే లేడు, ఫ్రెండ్‌లా మాతో బిహేవ్ చేశాడంటూ పేర్కొంది. అనంత‌రం నితిన్ ఇదే టీమ్‌తో మ‌రోసారి సినిమాచేయాల‌నుంద‌ని అన‌డం విశేషం.