ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:04 IST)

1997లోని మంగ్లీ పాడిన -ఏమి బతుకు- పాట విడుదల

Koti-mohan and others
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం `1997`. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాలో గాయ‌ని మంగ్లీ పాడిన ''ఏమి బతుకు ...'' అనే పాట‌ని  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు.
 
ఈ సందర్బంగా దర్శకుడు, న‌టుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకుడిగా చేసిన మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను చేసిన బ్లేడ్ బాబ్జి సినిమాలో మోహన్ నటించాడు. అప్పటినుండి తనతో ఈ అనుబంధం కొనసాగుతుంది. మోహన్ స్కూల్, హాస్పిటల్ రంగాల్లో సూపర్ సక్సెస్ సాధించాడు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే సినిమా రంగంలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు తెలుసు, చాలా పవర్ ఫుల్ కథతో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అని షాక్ అయ్యాను.  కథ విషయంలో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేసాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా రెండు పాత్రలు బాగా చేసాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట విన్నాను. చాలా ఎమోషన్ అయ్యాను. నిజంగా చాలా ఆలోచింపచేసేలా ఉండే సాంగ్ ఇది. ముక్యంగా మనసులు కదిలించే సాంగ్ ఇది. సామజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రజల్లో చైతన్యం తేవాలంటే కేవలం అది సినిమాలవల్లే సాధ్యం అని లెనిన్ మహనీయుడు చెప్పాడు. అందుకే ఇలాంటి సమస్యలను ప్రజలదగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్. ఈ సినిమాతో మోహన్ తప్పకుండా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకుంటాడు అన్నారు.
 
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అలాగే ఇందులో ఓ సాంగ్ యాడ్ చేద్దామని మోహన్ అన్నాడు. సరే అని చెప్పడంతో తానే ఈ సాంగ్ అద్భుతంగా రాసాడు. ఈ పాటకు మంగ్లీ అయితేనే న్యాయం చేస్తుందని అనిపించి ఆమెతో పాడించాం. మంగ్లీ గొంతులో నుండి వచ్చిన ఈ సాంగ్ మరో రేంజ్ కి వెళ్ళింది. తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు.
 
హీరో మోహన్ మాట్లాడుతూ, ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు.  ఈ సినిమా విషయంలో షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఇందులో ఓ సాంగ్ పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ముందు కోటి గారికి చెప్పాను. సరే అనడంతో ఈ సాంగ్ ని నేనే రాసాను ఈ పాట విన్న కోటి గారు ఈ పాటను మంగ్లీ తో పాడించాలనిచెప్పడంతో ఆమెతో పాడించాం. పాట చాలా బాగా వచ్చింది. ప్రతి  ఒక్క‌రినీ కదిలించే సాంగ్ ఇది. తప్పకుండా వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ ని పెట్టించేందుకు మళ్ళీ షూటింగ్ చేయకుండా షూట్ చేసిన సన్నివేశాలే వాడాం. పాటకు ఆ సీన్స్ బాగా సింక్ అయ్యాయి. ఈ పాటను మంగ్లీ పాడడంతో ఈ సాంగ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.