ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:34 IST)

పత్తాలేకుండాపోయిన కేతిరెడ్డి... ఫ్రీపబ్లిసిటీ కోసమేనా?

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" తీస్తున్నానని ప్రకటించినప్పుడు దానికి పోటీగా "లక్ష్మీస్ వీరగ్రంథం" తీస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచి హడావుడి చేసిన దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆ తర్వాత ఈయన పత్తాలేకుండాపోయారు. సినిమా గురించి ఊసెత్తలేదు.

లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డిని ఉంచబోతున్నట్లు ప్రకటించారు. టీజర్లు, పోస్టర్లు అంటూ కొన్నాళ్లు హంగామా చేశారు. అయితే చూడబోతుంటే అసలు ఈ సినిమాని ప్రారంభించారా? అనే సందేహం వస్తోంది. దానికితోడు మరో సినిమా అనౌన్స్ చేశాడు. అదే శశిలలిత. వర్మ శశికళ చేస్తానని చెప్పిన కొద్దిరోజులకే ఈయన ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చారు. 
 
ఇదంతా చూస్తుంటే వీళ్లు సినిమా చేయాలనుకుంటున్నారా? లేక ఫ్రీపబ్లిసిటీ కోసం ఉవ్విళ్లూరుతున్నారా? అనిపిస్తోంది. అసలు మన హీరోల బయోపిక్కులే జనం చూడటం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం చూసి దర్శక నిర్మాతలు ఎవరూ ఇలాంటివి తీయడానికి ముందుకు రావడం లేదు.

అలాంటిది మన మాజీ నటి, పక్క రాష్ట్ర సీఎం, ఆమె స్నేహితురాలు శశికళ బయోపిక్‌లు తీస్తే ఎవరు చూస్తారు. ఏదో ఒక వివాదం రేపి వర్మ పబ్లిసిటీ చేసుకుంటుంటాడు. అలా అందరికీ జరగదు. కాబట్టే కేతిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే కామెడీగా ఉందని ఫిలిం నగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.