శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:40 IST)

నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవర్ స్టార్ ఎందుకు రాలేదంటే...

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ, ఇదే ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కనిపించలేదు.
 
సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్లలేదని నెట్టింట పెద్ద చర్చే జరిగింది.. జరుగుతోంది. అయితే, కేవలం ఫోటోల్లో మాత్రమే పవన్ కనిపించలేదు. కానీ, ఆ రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం తర్వాత నాగబాబు నివాసానికి వెళ్లిన ఆయన కాబోయే దంపతులను ఆశీర్వదించారట.
 
ఇలా ఎందుకు చేశారనే కదా మీ సందేహం. గత నెల చాతుర్మాస దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఇది మొత్తం నాలుగు నెలలు కొనసాగే దీక్ష. ఈ దీక్షలో ఉన్న వారు సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు విడిచి వెళ్లకూడదన్న నిబంధన ఉంది. పైగా, నిశ్చితార్థం రాత్రి పూట కావడంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే విషయం తేటతెల్లమైంది.