Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ ఛాప్టర్ 2: సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ వైరల్

Written By సెల్వి
Updated: మంగళవారం, 24 డిశెంబరు 2019 (10:30 IST)
కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ కలెక్షన్లతో కుమ్మేసింది. భారత సినిమా ఇండస్ట్రీని కేజీఎఫ్ షేక్ చేసేసింది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హింది భాషల్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు యాష్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. కథ మీద నమ్మకం ఉండటంతో హంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.
 
కోలార్ గోల్డ్ మైన్స్, ముంబై మాఫియా ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఐదు భాషల్లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 238 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. అధీరా తమ్ముడు గరుడని హీరో చంపడంతో ముగిసిన తొలి పార్ట్.. అక్కడి నుంచి రెండో పార్ట్ మొదలు కానుంది. తాజాగా కేజిఎఫ్ పార్టీ 2కి సంబంధించిన లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండో పార్ట్‌లో అధీరాగా సంజయ్ దత్ నటిస్తుండగా, దివంగత ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో రవీనా టాండన్ నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

ప్రేమికుడిని పెళ్లాడిందని యువతి కిడ్నాప్, అడ్డొచ్చినవారిని కారుతో తొక్కిస్తూ దూసుకెళ్లారు

రూ.500 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసిన దిశా సాలియన్ తండ్రి

Heavy Rain: తెలంగాణలో మళ్లీ చురుగ్గా రుతుపవనాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్ర పోలీసులు ఎఫ్‌బీఐ తరహాలో ఫోజ్ కొడుతున్నారు.. వైఎస్ జగన్ ధ్వజం

ఆస్తి వివాదం - మాజీ సైనికుడు - కుమార్తెను హత్య చేసిన బంధువులు

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments