గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (10:52 IST)

హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకి మోడల్ ఆత్మహత్యాయత్నం

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ప్రముఖ మోడల్ గుంగున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆరో అంతస్తు నుంచి దూకడంతో ఛాతి, కాళ్లు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఉదయ్ పూర్‌లో నివాసముండే గుంగున్... శనివారం ఉదయమే జోధ్‌పూర్‌కు వచ్చిన హోటల్ గదిని అద్దెకు తీసుకుంది. రతనాడ ప్రాంతంలో ఉన్న లార్డ్స్ ఇన్‌ అనే హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్న గుంగున్... అదే రోజు రోజు రాత్రి టెర్రస్ పై నుంచి దూకేసింది. అయితే, దూకేముందు ఆమె తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తెలిపింది. 
 
దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, పోలీసులు హోటల్‌కు వచ్చే సమయానికి గుంగున్ కిందకు దూకేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు.