శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (18:25 IST)

చాలా ఫన్నీ గా మార్కెట్ మహాలక్ష్మి టీజర్ - శ్రీ విష్ణు ప్రశంస

Shree Vishnu, Parvatheesham, Pranikanvika
Shree Vishnu, Parvatheesham, Pranikanvika
కేరింత మూవీ ఫెమ్ హీరో  పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'టీజర్' ని టాలీవుడ్ హీరో "శ్రీ విష్ణు" ఘనంగా లాంచ్ చేసారు.

Market Mahalakshmi team
Market Mahalakshmi team
అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ: 'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీ గా ఉంటూనే హీరో & హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి, అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నాను. డైరెక్టర్ వియస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికి నా ఆల్ ది బెస్ట్. 
 
హీరో  'పార్వతీశం' మాట్లాడుతూ: మా సినిమా టీజర్ ని రీలిజ్ చేసినందుకు "శ్రీ విష్ణు" గారికి నా కృతజ్ఞతలు. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. 
 
కమెడియన్ "మహబూబ్ బాషా" మాట్లాడుతూ:  మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్  కధలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉంది. పైగా, అయన నాకు ఎంతో ఇష్టమైన హీరో.