1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:16 IST)

పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్

Chadalavada Srinivasa Rao, Nihar, prasanna kumar and others
Chadalavada Srinivasa Rao, Nihar, prasanna kumar and others
చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ మరియు ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ మాట్లాడుతూ,  ఇద్దరు అనాధలు ప్రపంచవ్యాప్తంగా దేశానికి గర్వకారణంగా ఎలా మారారు అనేది కథ. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన ఒక కొత్త పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేయడం జరిగింది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆ కొత్త పాయింట్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు అంత మంచి సినిమా అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : స్వర్గీయ చలపతిరావు గారు మొదటి రోజు నుంచి సినిమా కోసం నాతోపాటు నిలబడ్డారు. ఆయన డబ్బింగ్ చివరలో చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగం అయిన నా దర్శకుడు అజయ్ కే దక్కుతుంది. ఈ సినిమా ఎంత చక్కగా రావడానికి ఈవెంట్ ఇంత బాగా జరగడానికి నాకు ఎప్పుడూ నాకు పక్కనే కొండంతండగా ఉండేది నా ప్రసన్నకుమార్. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు ఈ సినిమాకి మెయిన్ హీరోలు ఆర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ కి పనిచేసిన  సాబు వర్గీస్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ నాలుగు టాకీసులు ఉండేవి. కష్టపడి పుల్లలమ్మి సంపాదించిన డబ్బుల్లో సగం నేను నా స్నేహితులు సినిమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. వేటగాడు, అడవి రాముడు, దేవదాసు ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నా తోటి చిన్న నిర్మాతలు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది నా కోరిక. నా 5 ఏళ్ల నుంచి ఇప్పటివరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీ కి ఉపయోగపడే కదా కావాలి అనుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. రీసెంట్ గా కొంతమంది నాతోటి దర్శకులు ఈ సినిమా చూసినవారు రికార్డ్ బ్రేక్ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్ గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరూ ఈ సినిమాను చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ : చదలవాడ శ్రీనివాసరావు గారు గతంలో జీవిత ఖైదీ చేశారు, మాతృదేవోభవ హిందీ తులసి మనిషా కొయిరాలతో చేశారు, నారాయణ మూర్తి గారితో ఏ ధర్తీ హమారీ అనే హిందీ సినిమా చేశారు. సినిమా మీద వచ్చే డబ్బును చూసుకోకుండా బిజినెస్ మీద వచ్చే డబ్బును కూడా సినిమా పైన పెట్టే అంతటి సినిమా ప్రేమికుడు చదలవాడ శ్రీనివాసరావు గారు. కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి. ఎవరికైనా కష్టం ఉంది అంటే నేనున్నానని ముందుండే వ్యక్తి. అదేవిధంగా బిచ్చగాడు వంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి. ప్రొడ్యూసర్ గా ఆయన సినిమాలుకు పెద్ద హీరోలు కూడా చేయలేని పబ్లిసిటీ చేసి సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ సినిమాతో ఎంతోమందిని ఇండస్ట్రీస్ పరిచయం చేస్తున్నారు. ఈ రికార్డ్ బ్రేక్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఇంకా నిర్మాత రామ సత్యనారాయణ, సంజన తదితరులు మాట్లాడారు 
తారాగణం : నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్