మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:21 IST)

భార్య పాతివ్రత్యం.. సలసల కాగే నూనెలో ఐదు రూపాయల కాయిన్ వేసి..?

Oil
భార్య పాతివ్రత్యం పరీక్షించేందుకు దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ఆమెకు అగ్నీ పరీక్ష పెట్టాడు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టించి.. అందులో ఉంచిన రూ. 5 నాణెం తీయించాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళకు ఫిబ్రవరి 11న తన భర్తతో గొడవ జరిగింది. దీంతో ఆమె ఎవరికి చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌గా పనిచేసే ఆ మహిళ భర్త నాలుగు రోజులుగా కారులో తిరుగుతూ ఆమె గురించి వెతుకుతూనే ఉన్నాడు. అయితే నాలుగు రోజుల తర్వాత ఆ మహిళ ఇంటికి చేరింది. దీంతో భర్త ఆమెను ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించాడు. దీంతో ఆమె జరిగిన విషయం అతనికి చెప్పింది.
 
పరాండాలోని ఖాచపురి చౌక్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. ఆ వ్యక్తులు నాలుగు రోజులుగా బంధీగా ఉంచారని పేర్కొంది. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరినట్టు చెప్పింది. 
 
అయితే మహిళ చెప్పిన మాటలు వినిపించుకుని భర్త.. ఇంటికి తిరిగివచ్చిన దీంతో వారి సంప్రదాయం(పర్ది) ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో ఐదు రూపాయల బిళ్ల వేసి దాన్ని చేతితో తీయాలని పరీక్ష పెట్టాడు.